All
దేశ యువత మిమ్మల్ని క్షమించదు: రాహుల్
ఓట్లను కొల్లగొట్టేందుకు కుట్రపన్నే వారిని లక్ష్యంగా చేసుకొని ప్రజా అభిశంసన కార్యక్రమం చేపట్టామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిపై కేసు పెట్టి న్యాయస్థానంలో విచారణ జరపాలన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మద్దతు పలికిన ఆయన.. విపక్ష నేతలంతా పచ్చిక బయళ్లలో కూర్చొని చర్చించాల్సి రావడం వింతగా ఉందన్నారు. వ్యవస్థలన్నీ తమకు అవకాశం ఇవ్వనప్పుడు మరో మార్గం లేకపోవడంతోనే ఇలా మాక్ పార్లమెంట్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు.



