తెలంగాణ

శాలివాన సిమెంట్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి…

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని నావేగం గ్రామ పంచాయితీ చించోల్లి గ్రామ శివారులోని శాలివాహన సిమెంట్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకుడు గోడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందల ఎకరాల భూములను 2009 వ సంవత్సరంలో రైతులకు శాలివాన కంపెనీ నిర్మించి ఉద్యోగాలు ఇస్తామని రైతుల వద్ద నుండి వందల ఎకరాల భూమిని తీసుకొని సంవత్సరాలు గడుస్తున్న ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీ నిర్మించకుండా ఉద్యోగాల మాట పక్కన పెట్టిందన్నారు.ఇప్పుడు ఆ భూములలో ఆ యాజమాన్యమే పంటలు వేసుకొని రైతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తుంది, రైతుల వద్ద నుండి భూమి తీసుకోనే సందర్భంలో ఇక్కడున్న అప్పటి కలెక్టర్ చించోల్లి శివారులో కంపెనీ యాజమాన్యం మరియు రైతులు అధికారులతో సమావేశాలు పెట్టి మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఫ్యాక్టరీ పడడం వల్ల వందల కుటుంబాలకు లాభాలు జరుగుతాయని మీ భూములను శాలివాన కంపెనీ యాజమాన్యంకు ఇవ్వాలని కోరితే అమాయక గిరిజన రైతులు తమ భూములను కంపెనీకి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అప్పగించారు, భూములు తీసుకున్న యాజమాన్యం ఇప్పటివరకు సంవత్సరాలు గడుస్తున్న కంపెనీ నిర్మించలేదు రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు ఆ రైతులు వ్యవసాయం చేయలేక ఉద్యోగాలు లేక రోడ్డున పడిన పరిస్థితి ఉంది, ప్రభుత్వము ఆ కంపెనీ యాజమాన్యానికి భూములు అప్పజెప్పి ఇప్పుడు చోద్యం చూస్తుంది ఆ యాజమాన్యం ఆ భూములలో కంపెనీ నిర్మించకుండా రైతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యమే రైతుల వద్ద తీసుకున్న భూములలో పంటలు వేసుకొని రైతులను తీవ్రంగా మోసం చేస్తుంది ఇది జిల్లా అధికార యంత్రంగానికి తెలిసిన పట్టించుకోవడం లేదు
వెంటనే మండల MRO, జిల్లా కలెక్టర్, ప్రభుత్వము చొరవ తీసుకొని ఆ రైతులకు తిరిగి భూములు ఇవ్వాలి, లేదా కంపెనీ నిర్మించి ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏదైతే రైతులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకొని కంపెనీ పెట్టకుండా భూములలో పంట వేసిన యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తునము. ఈ కార్యక్రమంలో DYFI జిల్లా అధ్యక్షులు బొర్కుటె శ్యాం రావ్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker