వైకాపా నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు
తెదేపా అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వైకాపా నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు బొండపల్లి ప్రయత్నం న్యూస్ విజయనగరం పరిషత్ పోరులో కూటమి విజయపరంపర కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైకాపా నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. బొత్స అనూషపై
5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నీరజ విజయంతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ రేసులో ఉన్న అనూష ఓటమి పాలవడంతో వైకాపా శ్రేణులు డీలాపడ్డాయి.
వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగాలని ప్రయత్నించారు. పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి బొత్స తమ్ముడి కుమారుడు చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనుష, గరివిడి నుంచి కోడలు బొత్స పూజిత, గుర్ల మండలం నుంచి బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి పోటీ చేశారు. గరివిడి జడ్పీటీసీగా బొత్స పూజిత విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల మెజార్టీతో పూజిత గెలుపొందారు. స్థానిక ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు.


