Allఆంధ్రప్రదేశ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచిన కేంద్ర హోంశాఖ

ఈ మధ్యే బిజెపితో జనసేన పొత్తు కుదిరిందో లేదో అప్పడు ఆ పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఏకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్సు (ఎన్ఎస్ జీ) భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర హోం శాఖ 8+8 ఎన్ఎస్ జీ కమాండోల భద్రతను పవన్‌కు కేటాయించడంతో వారు సోమవారం నుంచి ఆయనకు ఎన్ఎస్ జీ కమాండోలు భద్రత పర్యవేక్షణ ప్రారంభించడంవిశేషం.
సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడినప్పుడు, తరువాత ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు బయలు దేరివెళ్తున్నప్పుడు ఎన్ఎస్ జీ కమాండోల హడావిడి కనిపించింది.


