Allతెలంగాణ

డాక్టర్ చదువుతున్న విద్యార్థి దారుణ హత్య .

జయశంకర్‌ భూపాలపల్లి : డాక్టర్ చదువుతున్న విద్యార్థిని ఆగంతుకులు అత్యంత  దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశీ(20) అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి బావిలో పడేశారు. కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో కొట్టడంతోనే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

మృతుడి స్వస్థలం తుమ్మలపల్లి గ్రామంగా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వంశీ ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker