తెలంగాణ

పెట్రోలింగ్ పరేషాన్…అన్నీ మాకు తెలుసు మాకు మేమే సాటి దేనిని వదలం…పెట్రోలింగ్ సిబ్బంది

మెజారిటీ పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏళ్లతరబడి పాతుకుపోయారు. పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలపై పూర్తి పట్టు ఉండటం, ఎక్కడెక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎక్కడ నిర్మాణాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు ఎక్కడ ఎక్కువ, గొడవలు, కొట్లాటలు ఏ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతాయి. చోటామోటా నాయకులు, పోకిరీలు, ఆకతాయిలు, రౌడీషీటర్స్‌, వారి ఇల్లీగల్‌ దందాలు తదితర వాటిపై అవగాహన ఉండటంతో స్టేషన్‌ ఉన్న సైతం వారికే పెట్రోలింగ్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారు. నేరం జరిగినా, మరేదైనా సంఘటన చోటుచేసుకున్నా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లగలరనేది ఉన్నతాధికారుల ఉద్ధేశం. దాన్ని అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది సిబ్బంది వసూళ్ల దందాకు తెరతీస్తున్నారు. ఇటువంటి వారి నిర్వాకంతో స్టేషన్‌ మొత్తానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు పెట్రోలింగ్‌ సిబ్బంది పనితీరుపై దృష్టి పెట్టాలి. పెట్రోలింగ్ సిబ్బంది ఉదయం టిఫిన్ దగ్గర్నుండి డ్యూటీ అయిపోయేంతవరకు అన్ని సమయాలలో వారు తిరిగే అన్ని ప్రదేశాలలో భోజనం టి టిఫిన్ మరియు సేవింగ్ ఇంకా అన్ని రకాల సౌకర్యాలపై నిష్ణాతులై మాకెవరు సాటి లేరు అనే విధంగా ప్రవర్తిస్తూ వారి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటారు వారు తిరిగే విధానాన్ని బట్టి ఉన్నతాధికారులు కష్టం చేశారులే అనుకుంటారు కానీ అక్కడ చెడ్డ పేరు స్టేషన్ ఆఫీసర్ కి వస్తుంది దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత పెట్రోలింగ్ వాహనంలో పనిచేసే సిబ్బంది నెలకు లక్షల్లో సంపాదిస్తారని తేలింది అయితే అన్ని స్టేషన్లలో అలా లేదు హైదరాబాద్ మొత్తంలో 90 శాతం మంది పోలీసు సిబ్బంది మరియు ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది అందరూ పెట్రోలింగ్ పైనే ఆధారపడి ఉంటారు అనేది నిజం ట్రాఫిక్ పెట్రోలింగ్ ఈ రెండు అంశాలలో అధికారులకు పెద్ద మొత్తం లో డబ్బులు సమకూరుతాయని అనుకోవాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker