ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

రాజకీయాల్లో నాతో నడవగలరా పవన్‌ కల్యాణ్‌…..మంత్రి ధర్మాన ప్రసాదరావు

పోస్టర్లపై ఫోజులిచ్చి ఫొటోలు దిగే సినిమావారితో ప్రయోజనం ఉండదని మంత్రి
వ్యాఖ్యానించారు‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా నడుస్తామంటున్నారు. అది సాధ్యమా? మూడు కిలో మీటర్లయినా
రాజకీయాల్లో నాతో నడవగలరా? అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రశ్నించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా
గార మండలం లింగాలవలసలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. అక్కడ
సమీపంలో కొంతమంది యువకులు తమ ఫొటోలతోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని గమనించిన మంత్రి ధర్మాన అసహనానికి గురయ్యారు.
ప్రజలకోసం ప్రభుత్వం పనిచేస్తుందని.. దీన్ని గుర్తించాలని.. పోస్టర్లపై ఫోజులిచ్చి ఫొటోలు
దిగే సినిమావారితో ప్రయోజనం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు. నిజజీవితం వేరు..
సినిమా వేరని, ఒడిదుడుకులు ఉండేది రాజకీయాల్లో మాత్రమే అని చెప్పారు. సినిమాల్లో
బొమ్మలుపెట్టి యాక్షన్‌ చేస్తారని చెప్పారు. తనకిప్పుడు 64 ఏళ్లని.. అధికారంతో సంబంధం
లేకుండా 45 ఏళ్లపాటు ప్రజాజీవితంలోనే ఉన్నానని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker