All

మృతుడు కడప జిల్లా బి.కోడూరు మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!*

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌లో మృతి

రెండు బైకులు ఎదురెదురుగా ఢీ.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మృతుడు కడప జిల్లా బి.కోడూరు మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!*

167బీ జాతీయ రహదారిపై ఉప్పలపాడు స్టేజి వద్ద ప్రమాదం

*సీఎస్‌పురం:*సీఎస్‌పురం మండలం ఉప్పలపాడు స్టేజి సమీపంలోని మైదుకూరు–సింగరాయకొండ 167బీ జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కడప జిల్లా బి.కోడూరు మండలం హైత్రంపేటకు చెందిన 23 ఏళ్ల కొండా వెంకటసుబ్బారెడ్డి ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మృతిచెందారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన వెంకటసుబ్బారెడ్డి వివాహితుడు కావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

అతనితో ఉన్న మామ సిద్ధారెడ్డికి కాలు విరగగా.. సీఎస్‌పురానికి చెందిన డ్రైవర్ పాశం వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి. వెంకటేశ్వరరెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. పాశం వెంకటేశ్వర్లును ఒంగోలు తరలించగా.. సిద్ధారెడ్డిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

రెండు బైకుల ఢీకొన్న ఘటనలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవడంతో హైత్రంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker