తెలంగాణముఖ్యాoశాలు

రాచకొండ కమిషనర్ గా నేటికి ఆరు సంవత్సరాల 69 రోజులు

 ఆయన పనితనం కేసీఆర్నే కదిలించింది
 పోలీసు చరిత్రలోనే సుదీర్ఘకాలం ఒకే చోట పని చేసిన వ్యక్తిగా
 దేశంలోనే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచినవి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసే ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాదులో పని చేస్తున్నామని ఈ క్రమంలోనే రాచకొండ కమిషనరేట్ కమిషనర్ గా 2016 లో బాధ్యతలు చేపట్టిన మహేష్ భగవత్ నేటికీ ఆరు సంవత్సరాల 69 రోజులు అయ్యింది జంట నగరాల్లో ఈ రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలోనూ జనాభాలను పెద్దదేనని చెప్పుకోవాలి పోలీసు వ్యవస్థలో ఒకే చోట మూడు సంవత్సరాల కంటే  ఎక్కువగా ఎవరూ పని చేయరు మరి కొంచెం ఎక్కువ అను కుంటే నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత మరో అధికారికి ప్రమోషన్ పైన ఆ పదవిని అప్పగించాల్సి ఉంటుంది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థ పైన ఏమాత్రం జాలి చూపించట్లేదు అనడానికి ప్రమోషన్లు ఇవ్వలేదు అనడానికి ఉద్యోగులు ఒకే చోట సుదీర్ఘకాలం పని చేయడమే దీనికి గుర్తుగా తెలుస్తుంది ఎస్సైలు సీఐలు డీఎస్పీలు డీసీపీలు ఏసీపీలు మరియు అడిషనల్ ఎస్పీలు డిఐజీలు అసిస్టెంట్ కమిషనర్లు కమిషనర్ అందరికీ ఒకరి తర్వాత ఒకరు వెళుతూ ఉంటే మరొకరికి స్థానం వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమోషన్లు నిలిపివేసి బదిలీలు తాత్కాలికంగా ఆపివేసి కొంతమందిని మాత్రమే బదిలీలు చేస్తూ మరికొంతమందిని ఒకే చోట ఎక్కువ కాలం ఉంచుతూ పనిచేయుచుకుంటున్నారు అని చెప్పడానికి రాచకొండ కమిషనరేట్ లో కమిషనర్ గా పనిచేస్తున్న మహేష్ భగవత్ గారే ఆయన పనితీరు చెప్పుకోదగ్గది. ఏ కేసునైనా ఇట్లే నైపుణ్యంతో త్వరగా పూర్తిచేసి ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.  మహేష్ భగవత్ లాగా పనిచేసే కమిషనర్లు చాలా తక్కువగా ఉంటారని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం పొందిన ఎక్కువ మంది అధికారులు ఒకేచోట ఎక్కువ కాలం పని చేస్తారు మరి మహేష్ భగవత్ గారికి ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి అనుకోవాలా మరి ఎలా అనుకోవాలి వారితో పని చేస్తున్న అధికారులకే తెలియాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker