All
జోగిని రాళ్లబండి సుధాకర్ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, కారు చోరీ
చౌటుప్పల్‌లో అర్ధరాత్రి హత్య కలకలం
చౌటుప్పల్‌లో అర్ధరాత్రి హత్య కలకలం
జోగిని రాళ్లబండి సుధాకర్ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, కారు చోరీ
యాదాద్రి భువనగిరి ప్రయత్నం న్యూస్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అర్ధరాత్రి దారుణ హత్య కలకలం రేపింది. జోగినిగా పేరుపొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేసినట్లు సమాచారం.
హత్య అనంతరం దుండగులు సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, కారును దొంగిలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆధారాల సేకరణలో పోలీసులు
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తోంది. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.




