తెలంగాణ
జిహెచ్ఎంసి పరిధిలోపార్కులు గల్లంతు

2000 పార్కులు గాను 1000 పార్కులు కూడా లెక్కలో లేవు
పార్కులు మొత్తం ఆక్రమణ
హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్ గా సోమేశ్ కుమార్ ఉన్నప్పుడు మొత్తం పార్కుల సంఖ్య 2000 కి పై మాటే కానీ ప్రస్తుతం 1000 పార్కులు కూడా లెక్కలోకి రావడం లేదు చిన్న చిన్న పార్కులు అన్ని ఆక్రమించి ఇల్లు కట్టేశారు జిహెచ్ఎంసి పరిధి ఎంతవరకూ ఉందో అంతవరకే ఉన్న జోన్ల సంఖ్య 6 కి వచ్చి ఎక్కడి వారెక్కడ దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది కమిషనర్ ,డిప్యూటీ కమిషనర్, డైరెక్టర్ ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్లు, జోనల్ కమిషనర్లు వారి క్రింది స్థాయి సిబ్బంది. వీరందరూ వారి వారి పదవినీ అధికారాన్ని బట్టి వారికి అవసరమైన మేరకే సమాచారం ఉంటుంది తప్ప మిగిలిన సమాచారాలు వారికి అవసరం లేదు క్రింది స్థాయి సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు. వారిలో కాంట్రాక్టు వారు ఎంతమంది రెగ్యులర్ వారు ఎంతమంది అనేది డైరెక్టర్ స్థాయి అధికారికి తెలియదట మరి ఎంతమందికి జిహెచ్ఎంసి పరిధిలో సరిగ్గా జీతాలు అందుతున్నాయి ఇటీవల బయటపడిన శానిటేషన్ వర్కర్ల వేలిముద్రలు ఇంకా ఎన్ని ఉన్నాయో. జిహెచ్ఎంసిలో నిర్మాణం , శానిటేషన్, పార్కులు, టాక్స్ అధికారులు, ఎల్ఆర్ఎస్ అధికారులు, అధికారులు, విజిలెన్స్ అధికారులు వీరందరిలో ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు పొందేవారు ఎంతమంది వీరి స్థానాల్లో పని చేయడానికి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునే కాంట్రాక్టర్లు ఎంతమంది వీరు కాకుండా ప్రైవేటు ఉద్యోగులు వారు ఎంతమంది పనిచేస్తున్నారు అనేది మచ్చుకైనా కనపడట్లేదు. ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించి ఒక డైరెక్టర్ ను పూర్తి వివరాలు కావాలని ప్రశ్నించగా వారు విలేకరులకు ఏవిధమైన సమాచారం ఇవ్వకూడదు అని మాకు ఆదేశాలు ఉన్నాయి సీపీఆర్ఓ గారి దగ్గర మీకు కావలసిన సమాచారం దొరుకుతుందని మేము మీరు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకూడదని ఆయన ఘంటపదంగా చెప్పారు ప్రజాస్వామ్య పరిపాలనలో జవాబుదారీతనాన్ని కూడా జిహెచ్ఎంసి లో నోరు కట్టేశారు అని అనుకోవాలా ఇది ఎక్కడి పరిపాలన.


