All
నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు
హిందూపురం ప్రయత్నం న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి, మంచి నాయకులను ఎన్నుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.


