తెలంగాణ
హైదరాబాద్ బస్సుల్లో ఫిర్యాదుల పెట్టె

దశల వారీగా 2,800 సిటీ బస్సుల్లో అధికారులు ఫిర్యాదుల పెట్టెను అందుబాటులోకి తేనున్నారు. బస్సుల్లో సిబ్బంది ప్రవర్తన, టికెట్ చార్జీలు, నిర్వహణా లోపాలు తదితర ఆర్టీసీ సంబంధిత సమస్యల పరిష్కారానికి డిపో వరకూ వెళ్లకుండా పేపరుపై రాసి ఫిర్యాదుల బాక్సులో వేస్తే అధికారులు పరిష్కరించనున్నారు. బాక్సుల్లో ప్రయాణికులు వేసే ఫిర్యాదులు, సూచనలకు అనుగుణంగా మెరుగైన సేవలందించవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. ట్రిప్పుల్లో మార్పులు, అదనపు ట్రిప్పులు, రిక్వెస్ట్ స్టాప్‌ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


