All

రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించిన షర్మిల దంపతులు

రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

ఏపీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లకూ పెళ్లి ఆహ్వానం పంపిస్తా: షర్మిల

 

ఢిల్లీ : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తమ కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ భర్తతో కలిసి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు షర్మిల తెలిపారు.రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, పార్టీని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న హింస గతంలో ఎన్నడూ చూడలేదని, ఇది కూటమి ప్రభుత్వానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. టీడీపీ తర్వాత అత్యధిక వార్డులను గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీతో పాటు ప్రజల నుంచి మరింత మద్దతు అవసరమని షర్మిల అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాయని, లేదంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలన్నీ బీజేపీతో కలిసి ఉన్నాయని ఆరోపించారు. ఏపీకి విభజన హామీలు అమలు కాకపోవడానికి బీజేపీతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలే కారణమని విమర్శించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని షర్మిల అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించవచ్చని పేర్కొంటూ, తన కుమార్తె వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను కూడా ఆహ్వానిస్తానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker