All
రెడ్డిపల్లిలో గ్రామసభ లబ్ధిదారులకు పింఛన్ పత్రాల పంపిణీ
గ్రామ సర్పంచ్ నరసింహ, ఎంపీడీవో టీ చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంగళరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేశారు.
రెడ్డిపల్లిలో గ్రామసభ లబ్ధిదారులకు పింఛన్ పత్రాల పంపిణీ
చేగుంట, నవంబర్18 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
పింఛన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సమీనా సుల్తానా పాలకవర్గం గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


