Allఆంధ్రప్రదేశ్

పవన్ నిర్ణయాన్ని సమర్ధించిన సోమిరెడ్డి

అమరావతి: జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుపట్టారు. పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఆయనలో నిలకడైన విధానాలు లేవంటూ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సోమిరెడ్డి స్పందించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేశారు. అలాంటప్పుడు పవన్‌కల్యాణ్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదంటూ సోమిరెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఏం ట్వీట్ చేశారంటే…  ‘లక్ష్మీ నారాయణ గారూ.. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ… రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం’ అని సోమిరెడ్డి ట్వీట్‌ చేశారు.
లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ జనసేనికులు తీవ్రంగా తప్పుపడుతుంటే.. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం స్వాగతించారు. తాజాగా పవన్ నిర్ణయాన్ని సోమిరెడ్డి సమర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker