All
జెడ్.పి.హెచ్.ఎస్ Narsingi పాఠశాలలో విద్యార్థులు ఒక రోజు పాటు పాఠశాల పాలనా బాధ్యతలను స్వీకరించారు.
విద్యార్థులే ఉపాధ్యాయులు గా వ్యవహరించి పాఠశాలను నిర్వహించారు.
జెడ్.పి.హెచ్.ఎస్ Narsingi పాఠశాలలో విద్యార్థులు ఒక రోజు పాటు పాఠశాల పాలనా బాధ్యతలను స్వీకరించారు.
చేగుంట నవంబర్ 13 ప్రయత్నం న్యూస్
ఈ సందర్భంగా విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి, చిన్న తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రార్థనా సమావేశం నుండి తరగతి నిర్వహణ, క్రమశిక్షణ వరకు అన్ని బాధ్యతలను విద్యార్థులే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయుడు రవి చందర్ తెలిపారు. విద్యార్థులు కూడా తమ అనుభవాన్ని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా రిత్విక్, కలెక్టర్గా హారిక, జిల్లా విద్యాశాఖ అధికారిగా శ్వేత, మండల విద్యాధికారిగా సిమ్యా , పీడీ గా శ్రీజయ్ లు వ్యవహరించారు



