
జనసేనకు జెడి లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. గురువారం ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ పంపుతూ, సదరు ప్రతిని మీడియాకు విడుదల చేసారు. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని, ఇప్పుడు రెండు సినిమాలు అంగీకరిస్తూ, పవన్ తీసుకున్న నిర్ణయం సరికానిదని ఆయన అన్నారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని పదే పదే చెప్పిన పవన్‌లో ప్రతి అంశంలోనూ నిలకడైన విధి విధానాలు అవలం బించడం లేదని పవన్‌పై ఘాటు విమర్శలు చేసారు.
విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేసిన జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు
ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు అని లేఖలో పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు ఇకపై నేను వ్యక్తిగత స్థాయిలో అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.



