తెలంగాణ
గుండెపోటుతో….. షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత మృతి

గుండెపోటుతో..... షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత మృతి షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత గుండెపోటుతో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల క్రితం సుజాత భర్త ఆత్మహత్య చేసుకన్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




