
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు గాలికి........ ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీస్ నియంత్రణే.... పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కీటుగాళ్లు వాహనాలు వదిలే పొగ కారణంగా మనిషి ఆయువు అక్కడికక్కడే ముగిసిపోవచ్చు లేదా ఆసుపత్రి పాలు కావచ్చు ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గమనించారా అంటే వారికి ఏమాత్రం తెలియదు అని చెప్పుకోవాలి నిజానికి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేయడమే కాదు ఎన్ని రకాలుగా వాహనాలను పరిశీలించాలి వాటిని రోడ్డుపై తిరగనివ్వాలి లేదా అనేది కూడా ట్రాఫిక్ పోలీసు డిసైడ్ చేయాలి అటువంటి ట్రాఫిక్ నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు గాలికి వదిలి కేటుగాళ్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ట్రాఫిక్ పోలీసుల కళ్ళుగప్పి వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా భారీ వాహనాలు మరియు బైకులు కార్లు ఒక్కటేంటి అనేక రకాల వాహనాలు విచ్చలవిడిగా కూకట్పల్లి ప్రాంతంలో రోడ్డుపై నడుస్తున్నాయి వీటిని పట్టించుకునే నాధుడు లేడా అంటే ఉన్నారు కానీ కంటికి కనపడింది మాత్రమే వారికి కెమెరాకు మరియు చలానాలు కట్టారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు ఇటీవల కాలంలో పెద్ద వాహనాలు సైతం రోడ్లపై సంచరిస్తూ ఉండడం చూస్తున్నాం పెద్ద వాహనాలు చిన్న వాహనాలను రోడ్డుపై యాక్సిడెంట్ చేసి ఆగకుండా వెళ్ళిపోవడం చాలాసార్లు జరిగింది చిన్న బైకులు సైతం ఎదుటివారిని వాహనాన్ని తగిలించుకుంటూ పోవడం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎన్నో ప్రశ్నలు వస్తాయని భయంతో వాహనదారులు మిన్నక ఉండి పోతున్నారు . డ్రంక్ అండ్ డ్రైవ్, చలానాల తనిఖీ ఈ రెండు తరచూ నిర్వహిస్తుంటాం వాహనాలు నడిపే వారే వాహనదారుల లేక మరొకరు ఇటువంటి పేపర్లు లేకుండా లైసెన్సులు లేకుండా నడుపుతున్నారా అని ఇటీవల కాలంలో పరిశీలించటం మర్చిపోయారు. నగర పరిధిలో చిన్న వయసులో కొత్త వాహనాలను తీసుకొని లైసెన్సులు లేకుండా చిన్న పిల్లలు వాహనాలను రోడ్డుపైకి తెస్తే చలానా లేవు కదా అని వదిలేస్తున్నారు టిప్పర్లు, డీసీఎంలు కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి వస్తున్న పట్టించుకునే నాధుడే లేడు ఆటోలు బైకులు ట్రాక్టర్లు ఇతర వాహనాలు వాహన సమయం అయిపోయినప్పటికీ కండిషన్ లేకపోయినా పూర్తి పొగతో రోడ్డుపై తిరుగుతున్న వాటి సంగతి మాత్రం వదిలేసి కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా చలానాలు ఈ రెండు మాత్రమే తనిఖీలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉంది నెంబర్ ప్లేట్లు లేవు అంటే ఏ చర్యలు తీసుకోవాలి అని కూడా కొంతమంది అధికారులకు తెలియదు ఇటీవల కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణ నియమ నిబంధనలు పోలీసులు పాటించాల్సిన సమయస్ఫూర్తి వాటిపై ప్రత్యేకమైన విధివిధానాలను ప్రకటన రూపంలో విడుదల చేశారు అయినప్పటికీ సైబరాబాద్ పరిధిలో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు చలానాలు రేష్గా మంచి మర్యాద అనేది మర్చిపోయి ప్రవర్తిస్తూ కేవలం చలానాల వసూలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు తమ డ్యూటీలు చేస్తున్నారు




