All

ఓ స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ అభ్యర్థి స్రవంతి 1,508 ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బమ్మకు 1,037 ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 27 ఓట్లు పోలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీసం తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఓట్లయినా పొందుతుంటారు. కానీ ఈ అభ్యర్థికి మాత్రం ఒక్క ఓటే రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన చడా సువర్ణకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పోలైంది. అదే స్థానంలో

టీడీపీ అభ్యర్థి స్రవంతి తన ప్రత్యర్థిపై 471 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం స్వతంత్ర అభ్యర్థి సువర్ణకు వచ్చిన ఒక్క ఓటే. అసలు ఆమెకు కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదా? లేక మద్దతుదారులు సైతం దూరంగా ఉన్నారా? అంటూ గ్రామస్థులు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker